Friday, 8 April 2011

స్త్రీ నవ్వలే గాని.. ముత్యాలని వరసకట్టి మెరిపించగలదు.
స్త్రీ పాడాలే గాని...కోయిల మూగ బోయేలా పాడగలదు.
స్త్రీ అడాలే గాని..నెమలి నివ్వెర పోయేలా ఆడగలదు.
స్త్రీ సంతోషించాలే గాని.. మేఘంలా పరవశించి వర్షించగలదు.
స్త్రీ కరుణించలే గాని...మహాసముద్రాని గుండె లోతుల్లోంచి పొంగించ గలదు.
స్త్రీ ప్రేమించాలే గాని.. .రక్తాన్ని క్షీరంగా మార్చి అందించగలదు. (నుదుటన తిలకం లా దిద్దుకోగలదు)
స్త్రీ లాలించాలే గాని... దేవుణ్ణి సైతం నిద్రపుచ్చ గలదు.
స్త్రీ అనుకోవాలే గాని...మూతి తిప్పినంతలో మగాడిని ఓడించగలదు.
స్త్రీ కోరుకోవాలే కాని... ఆకాశాన్ని చీరలా చుట్టుకోగలదు.
స్త్రీ తలచుకోవాలే గాని..చుక్కలని దారంతో దండ కట్టి తలలో తురుముకోగలదు.
స్త్రీ పునుకోవాలే గాని.. ప్రపంచాన్ని కాళ్ల పట్టీలుగా మార్చుకోగలదు.
స్త్రీ ఆపాలే గాని ...భూగోళాన్ని( మగాడి గుండెని ) ఒక్క చిరునవ్వు తో ఆపగలదు.
స్త్రీ ఆడించాలే గాని.. లోకాన్ని బంతిల మార్చి ఫుట్ బాల్ ఆడగలదు.
స్త్రీ అనుకోవాలే గాని ఏదయినా చేయగలదు.
కానీ ఏదీ అనుకోదు...

No comments:

Post a Comment