Tuesday, 12 April 2011

ఓ మనిషి... నీకు
సాయం చేసే హృదయం లేనప్పుడు
పెట్టెల నిండా డబ్బెందుకు?

పని చేసేది లేనప్పుడు
రాత్రి కలల్లో మేడలెందుకు?

ఎదుటి వారి కన్నీటిని తుడిచే
ప్రేమ లేనప్పుడు నీ చేయెందుకు?

తల్లిని వదిలించుకునే కొడుకెందుకు?
బిడ్డకు అన్నం పెట్టని తల్లెందుకు?

ఆడుబిడ్డలను కాదనె అన్నందెకు?
అందరిని దూరం చేసుకునె ఆలెందుకు?

స్నానం చేయని దేహమెందుకు? ఆ
దేహంపై రంగురంగుల దుస్తులెందుకు?

నీ ఇంట్లో నీ మిత్రునికి విలువ లేనప్పుడు
అతనితో నీ స్నేహమెందుకు?

ప్రేమించే మనసు లేనప్పుడు నీ జన్మెందుకు?
ఇవనీ విని ఏ ఒక్కటీ పాటించని నీ వెందుకు?

Friday, 8 April 2011

అతనొక సాధారణ వ్యక్తిలా కనిపించే ఒక మహా శక్తి
మద్యంతోనూ స్నేహం చేస్తూ మద్యం ముట్టని మానవమూర్తి
గంభీరంగా కనిపించే ఒక హాస్య బ్రహ్మ
రెండు చేతులు చాలవనుకునే సహాయకారి
మనిషంటే గౌరవిస్తాడు.. మనసులోతుల్లోకి ఝూస్తాడు
నవ్వుతూ పలకరిస్తాడు.. స్నేహ హస్తమందిస్తాడు
తెలిసింది పంఝుకుంటాడు.. తెలియంది శోధిస్తాడు
సమస్య ఏమంటూనే పరిష్కారం చెప్పేస్తాడు
కానీ ఎవరి మాట వినడు... అందరూ అతని మాట వింటారు
ఆ గొప్ప వ్యక్తే పరమేశ్వర్ (ద గ్రేట్)




స్వేచ్చ కావాలి..
పిల్లలకి స్కూల్ నుండి స్వేచ్చ కావాలి ..
విద్యార్థులకి చదువు నుండి
పేదవాడికి దరిద్రం నుండి..
మనిషికి సంఘం నుండి
ప్రేమికుడికి...కులాలు..మతాలూ..అంతస్తుల నుండి
వివాహితులకి వివాహం నుండి
ఎకాకికి ఒంటరి తనం నుండి..
బానిసకు యజమాని నుండి కావాలి..
ఉద్యోగికి అధికారి నుండి..
ధనికుడికి tax నుండి...
సెలెబ్రిటీస్ కి అభిమానులు, మీడియా నుండి
జీవితం చాలు అనుకున్నా వాడికి జీవితం నుండి
ప్రస్తుతానికి నీ నుంచి నాకు (పరమేశ్వర్) స్వేచ్ఛ కావాలి...
స్త్రీ నవ్వలే గాని.. ముత్యాలని వరసకట్టి మెరిపించగలదు.
స్త్రీ పాడాలే గాని...కోయిల మూగ బోయేలా పాడగలదు.
స్త్రీ అడాలే గాని..నెమలి నివ్వెర పోయేలా ఆడగలదు.
స్త్రీ సంతోషించాలే గాని.. మేఘంలా పరవశించి వర్షించగలదు.
స్త్రీ కరుణించలే గాని...మహాసముద్రాని గుండె లోతుల్లోంచి పొంగించ గలదు.
స్త్రీ ప్రేమించాలే గాని.. .రక్తాన్ని క్షీరంగా మార్చి అందించగలదు. (నుదుటన తిలకం లా దిద్దుకోగలదు)
స్త్రీ లాలించాలే గాని... దేవుణ్ణి సైతం నిద్రపుచ్చ గలదు.
స్త్రీ అనుకోవాలే గాని...మూతి తిప్పినంతలో మగాడిని ఓడించగలదు.
స్త్రీ కోరుకోవాలే కాని... ఆకాశాన్ని చీరలా చుట్టుకోగలదు.
స్త్రీ తలచుకోవాలే గాని..చుక్కలని దారంతో దండ కట్టి తలలో తురుముకోగలదు.
స్త్రీ పునుకోవాలే గాని.. ప్రపంచాన్ని కాళ్ల పట్టీలుగా మార్చుకోగలదు.
స్త్రీ ఆపాలే గాని ...భూగోళాన్ని( మగాడి గుండెని ) ఒక్క చిరునవ్వు తో ఆపగలదు.
స్త్రీ ఆడించాలే గాని.. లోకాన్ని బంతిల మార్చి ఫుట్ బాల్ ఆడగలదు.
స్త్రీ అనుకోవాలే గాని ఏదయినా చేయగలదు.
కానీ ఏదీ అనుకోదు...

hai

hai